నువ్వు మారగలవు. నువ్వు మాత్రమే కాదు, మారాలనే కోరిక ఉన్న ఎవరైనా మారగలరు. మనకు తెలియకుండానే రోజులు వారాలుగా, వారాలు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారిపోతాయి. కొంతకాలం తర్వాత అనుకున్నది చెయ్యలేకపోయాననే విచారం మొదలవుతుంది. కాబట్టి రేపటినుండే నువ్వు నీ జీవితంలో కోరుకున్న మార్పుని ప్రారంభించు.
ఆన్‌లైన్‌లో చదవడానికి ఎంపిక చేసిన రచనలు.
ఈ రచయిత సృష్టించిన సాహిత్య రచనలు, నవలలు మరియు ప్రేరణాత్మక గ్రంథాలను అన్వేషించండి.
తెలుగు సాహితీ ప్రపంచంలో ఆధ్యాత్మిక, నైతిక, మరియు వ్యక్తిత్వ వికాస రచనలకు విశేష ప్రాచుర్యం తెచ్చిన ప్రముఖ సాహితీవేత్త, కథకుడు మొండెపు ప్రసాద్. ప్రాచీన భారతీయ గ్రంథాలలోని సారాన్ని నేటి తరానికి అర్థమయ్యేలా సులభమైన, ఆకర్షణీయమైన శైలిలో అందించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపును పొందారు.
మొండెపు ప్రసాద్ ప్రధానంగా సమాజ చైతన్యం, ఆధ్యాత్మికత, వ్యక్తిత్వ వికాసం, మరియు యువతకు మార్గదర్శకత్వం అందించే రచనలు చేశారు.
ఆధునిక జీవితంలోని ఒత్తిళ్లను అధిగమించడానికి ప్రాచీన ఆధ్యాత్మికతను, భారతీయ సంస్కృతిని ఒక చక్కని వారధిలా మలిచి ఆయన అందించిన సేవలు తెలుగు సాహిత్యానికి ఎంతో అమూల్యమైనవి.
మొండెపు ప్రసాద్ గారు తెలుగు సాహిత్యం, ఆధ్యాత్మికత మరియు సామాజిక చైతన్యంపై చిన్ననాటి నుంచే ఆసక్తి పెంపొందించుకున్నారు. సాహిత్యాన్ని సమాజ మార్పుకు సాధనంగా ఉపయోగించాలనే సంకల్పంతో ఆయన రచనా ప్రయాణాన్ని ప్రారంభించారు.
2008లో స్వాతి వారపత్రికలో ప్రచురించబడిన "ఎనిమిదో అడుగు" సీరియల్ ద్వారా ప్రముఖ రచయతగా గుర్తింపు పొందారు వీరు.
“అమ్మాయి పెళ్లి” కథకు 2011లో ప్రతిష్టాత్మకమైన స్వాతి అనిల్ అవార్డు లభించడం ద్వారా మొండెపు ప్రసాద్ గారి కథా రచనకు విశేష గుర్తింపు లభించింది.
స్వాతి మాసపత్రిక అనుబంధ నవలగా ప్రచురించబడిన మొండెపు ప్రసాద్ రచించిన “అత్యాచారాల పై అక్షర పోరాటం” నవలను ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు 2014లో డైలీ సీరియల్ గా ప్రశారం చేసారు.
దూరదర్శన్ సప్తగిరి కేంద్రం వారు “సాహిత్యంలో సామాజిక విలువలు” మరియు “వేమన చెప్పిన వేదం” వంటి కార్యక్రమాలలో మొండెపు ప్రసాద్ గారితో ప్రత్యేక సాహిత్య కార్యక్రమాలను ప్రసారం చేశారు.
ప్రసాద్ గారి లిటరరీ ఇంటర్వ్యూలు ఆంధ్రజ్యోతి డైలీ, నవ్య వీక్లీ, సహరి మరియు ఉషా వీక్లీ లలో ప్రచురించబడ్డాయి.
సాహిత్యం రంగంలో విశిష్టమైన కృషి చేసినందుకు మొండెపు ప్రసాద్ ను అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ శ్రీ మన్మధనామ సంవత్సర ఉగాది పురస్కారం -2015 బహూకరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పృజనాత్మకత మరియు సంస్కృతి సమితి, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వహణ కమిటీ, చెన్నై “అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం” 21/2/2019 నాడు తెలుగు భాషకు చేసిన సేవకు గుర్తింపుగా మొండెపు ప్రసాద్ కు పురస్కారం అందజేశారు.
2021లో “సోషల్ మీడియా ఫాలోయింగ్ –మోనోపొలి ఆటలో డబ్బు” కథకు ప్రతిష్టాత్మకమైన స్వాతి అనిల్ అవార్డు రెండోసారి లభించడం ద్వారా మొండెపు ప్రసాద్ గారు గొప్ప కథా రచయితగా స్థానం సుస్థిరం చేసుకునారు
యువతకు భారతీయ విలువలను చేరవేయాలనే ఉద్దేశంతో “యువతకు భగవద్గీత చూపించిన దారి”, “సుందరకాండ – విజయసూత్రాలు”, “వేమన చెప్పిన సక్సెస్ మంత్ర” “ఉద్యోగపర్వం నుండి సంభాషించే కళ” “భాగవతం నుండి సుభాషితాలు” “రామాయణం నుండి యువతకు విలువలు విజయసూత్రాలు” “దేవీ భాగవతం నుండి సుభాషితాలు” వంటి రచనలు చేశారు
గంధం నాగసుబ్రహ్మణ్యం (సమాచారం, తొలి తెలుగు స్థానిక దినపత్రిక) స్మారక అవార్డు – రాజమహేంద్రవరంలో సెప్టెంబరు 15, 2024 నాడు పొందారు
సాహిత్యం రంగంలో విశిష్టమైన కృషి చేసినందుకు మొండెపు ప్రసాద్ ను అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి, భాషా సాంస్కృతిక శాఖ శ్రీ విశ్వావసు నామ సంవత్సర కళారత్న(హంస) పురస్కారం -2025 బహూకరించారు.
సామాజిక వాస్తవికత, ఆధ్యాత్మికత మరియు భారతీయ విలువలను విశ్లేషిస్తూ మొండెపు ప్రసాద్ గారు అనేక పరిశోధనాత్మక రచనలు చేశారు.
తెలుగు సాహిత్యంలో నైతిక, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక విలువలను ప్రజలకు చేరవేస్తూ మొండెపు ప్రసాద్ గారు సాహిత్య వేదికలపై చురుకుగా పాల్గొంటున్నారు.
మొండెపు ప్రసాద్ గారు ప్రస్తుతం రాస్తున్న ధారావాహికలు:
(1) “శ్రీ వేంకటేశ్వరస్వామి అవతారం నేర్పే పాఠాలు” అనే శీర్షికను స్వాతి మాసపత్రికలో జూలై 2025 నుండి సీరియల్ గా వ్రాస్తున్నారు.
(2) “శివపురాణం నుండి సుభాషితాలు” అనే శీర్షికను శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ వారు ప్రచురించే కనకదుర్గప్రభ ధర్మప్రచార మాసపత్రికలో మార్చి 2026 సంచిక నుండి ధారావాహికగా వ్రాస్తున్నారు