పుస్తక సమీక్ష
ఈ పుస్తకం నుండి యువత నేర్చుకోదగ్గ విజయసూత్రాలు కొన్ని:
స్పష్టమైన లక్ష్య నిర్దేశం (Goal Setting): హనుమంతుడు సీతాన్వేషణ కోసం లంకకు వెళ్లినప్పుడు, అతని లక్ష్యం స్పష్టంగా ఉంది – సీతమ్మను వెదకడం, సీత జాడ రామునికి తెలియజేయడం. యువత కూడా తమ కెరీర్ లేదా జీవిత లక్ష్యాలను స్పష్టంగా (Specific Goals) పెట్టుకోవాలని ఈ పుస్తకం సూచిస్తుంది.
ఆత్మవిశ్వాసం & సాహసం (Self Confidence & Courage): సముద్రాన్ని దాటేడప్పుడు హనుమంతుడు చూపించిన ధైర్యం, ఆత్మవిశ్వాసం యువతకు ఆదర్శం. నేను చేయగలను (I can do it) అనే నమ్మకం ఉంటే ఎంతటి కష్టమైన లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని హనుమంతుడు నిరూపించాడు.
ప్రణాళికా రచన (Planning & Strategy): లంకలో అడుగుపెట్టాక హనుమతుడు తొందరపడకుండా, నిశ్శబ్దంగా పరిస్థితులను అంచనా వేసి (Analysis), తన ప్రణాళికను అమలు చేశాడు. ఇది యువతకు “పని చేసేముందు ప్రణాళిక” యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
ఏకాగ్రత & వివేకం (Focus & Intelligence): హనుమంతుడు రావణుని అంతఃపురంలో సీత కోసం వెతుకుతూ, ఎక్కడపడితే అక్కడ వెతకకుండా అత్యంత ఎకాగ్రతతో (Focus) తన సమయాన్ని, శక్తిని సద్వినియోగం చేసుకున్నాడు.
సంక్షోభ నిర్వహణ (Crisis Management): లంకాదహనం వంటి ఘట్టాలు హనుమంతుడు క్లిష్ట పరిస్థితులలో కూడా ఎలా ప్రశాంతంగా, సమయస్పూర్తితో (Presence of mind) సమస్యను పరిష్కరించాడో తెలియజేస్తాయి
భక్తి, కర్మ, జ్నానాల సమ్మేళనం: హనుమంతుడు తన శక్తినంతటినీ రాముని కోసం (దైవం/ఉన్నత లక్ష్యం)వినియోగించాడు. ఇది నిస్వార్ధ సేవ మరియు కార్యదీక్షను బోధిస్తుంది.